శ్రావణమాసంలో పండగలు..ముఖ్యమైన తేదీలు ఇవే..

-

ఆషాడమాసం పూర్తి అయ్యింది..ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది..నిన్నటి అమావాస్య తో శ్రావణమాసం ప్రారంభం అయ్యింది..హిందువులకు ఈ మతం చాలా ప్రత్యెకమైనది..శ్రావణ మాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో చాలా పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, ఈ మాసాన్ని సాత్విక మాసం అని పిలుస్తారు. కాబట్టి చాలా మంది ఈ నెలలో శాఖాహారం తీసుకుంటారు. శ్రావణసోమవారం ,శుక్రవారం, శనివారం ఉపవాసం ఆచరిస్తారు. శ్రావణ మాసం 2022 జూలై 29 నుండి మొదలై ఆగస్టు 27 వరకు కొనసాగుతుంది..

ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆగస్టు 1: శ్రావణ సోమవారం

ఆగస్టు 2 : నాగపంచమి

ఆగస్టు 3: గరుడపంచమి

ఆగస్టు 5 : వరలక్ష్మీవ్రతం

ఆగస్ట్ 8   : శ్రావణ సోమవారం

ఆగస్టు 11: రాఖీపూర్ణిమ

ఆగస్టు 12: హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ

ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 15: సంకష్టీ చతుర్థి

ఆగస్టు 18: శ్రీ కృష్ణ జయంతి (అష్టమి)

ఆగస్టు 23: అజ ఏకాదశి

ఆగస్టు 24: ప్రదోషవ్రతం

ఆగస్టు 25: మాసశివరాత్రి

ఆగస్టు 27:పొలాల అమావాస్య

ఆగస్టు 28:భాద్రపదమాసం ప్రారంభం

ఆగస్టు 30: వరాహ జయంతి

ఆగస్టు 31: వినాయకచవితి.

శ్రావణమాసం లో వచ్చే మొదటి పండగ నాగ పంచమి.ఈ సంవత్సరం నాగపంచమి 2 ఆగస్ట్ 2022 వచ్చింది..ఆ రోజున నాగ పూజ చేస్తారు.

రాఖీపూర్ణిమ..ఈ పండగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11న ఉదయం 10:38 గంటలకు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ శుక్రవారం ఉదయం 07:05 గంటలకు ముగుస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ 11న పూర్తి రోజు ఉన్నందున రక్షా బంధన్ ఆగస్టు 11 గురువారం జరుపుకుంటారు.

సంక్షోభాన్ని అధిగమించే చతుర్థి సంకష్తి చతుర్థి. సంకష్టి అనేది సంస్కృత పదం, దీని అర్థం ‘సమస్యల నుండి బయటపడటం’. ఈ రోజున మనిషి తన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి గణేశుడిని పూజిస్తారు..ఈ ఏడాది ఆగస్టు 15 న వచ్చింది.

శ్రీ కృష్ణ భగవానుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జన్మించాడు. అందుకే ఈ రోజును శ్రీ కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జయంతి 2022 ఆగష్టు 18న జరుపుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version