కరోనా కారణంగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఖాతాదారులను బాదడానికి పలు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. పలు కారణాల పేరిట కస్టమర్లపై చార్జిలు మోపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్‌ను ఉంచనివారితోపాటు పలు ఇతర కారణాలను చూపి బ్యాంకులు చార్జిల మోత మోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకులు కస్టమర్లపై బాదుడుకు సిద్ధమవుతున్నాయి. మినిమం బ్యాలెన్స్‌తోపాటు నగదు లావాదేవీలపై చార్జిలను వసూలు చేయనున్నాయి. ఆగస్టు 1 నుంచి కొత్తగా ఆయా బ్యాంకులు చార్జిలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కస్టమర్లు ఇకపై తమ ఖాతాల్లో కనీసం రూ.2వేలను మెయింటెయిన్ చేయాలి. ఇది పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు రూ.1500 కనీస బ్యాలెన్స్ ఉంచాలి. ఇంత కన్నా తక్కువ మొత్తం ఉంటే ఫైన్ విధిస్తారు. ఇక కరెంట్ అకౌంట్ ఖాతాదారులు రూ.5వేల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. ప్రతి నెలా 3 విత్‌డ్రాయల్స్ ఫ్రీగా ఉంటాయి. దాటితే ఫైన్ పడుతుంది. అలాగే డిపాజిట్లకు కూడా పరిమితులు ఉంటాయి. దాటితే రూ.100 వరకు చార్జి వసూలు చేస్తారు. కానీ లాకర్ డిపాజిట్ చార్జిలను మాత్రం తగ్గించనున్నారు.