ప‌వ‌ర్ స్టార్ నుంచి ‘గడ్డి తింటావా?’ అంటూ తొలి సాంగ్‌..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’‌ పేరిట తీస్తోన్న సినిమా నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కనపడుతున్న పాత్ర నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఈ సినిమాలోని ‘గ‌డ్డి తింటావా?’ అనే పాటను ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలోని హీరో తన ఫాంహౌస్‌లో త‌న గేదెలు, చెట్లను ఉద్దేశిస్తూ ఈ పాట పాడతాడ‌ని వర్మ తెలిపారు.

ఇకపోతే జూలై 22న ఉదయం 11 నుండి “పవర్ స్టార్” ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని.. ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ అని చెప్పకొచ్చాడు వర్మ. ఇక పవర్ స్టార్ సినిమా ఈ నెల 25న ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదలకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news