-39 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో బికినీ పార్టీ చేసుకున్నారు.. వైర‌ల్ వీడియో..!

-

ఎవ‌రో మ‌హానుభావుడు అన్నాడు.. ఎవ‌డి పిచ్చి వాడికి ఆనందం అని.. అవును.. స‌రిగ్గా ఈ సామెత వారికి స‌రిపోతుంది. ఎందుకంటే ఓ వైపు గ‌డ్డ క‌ట్టించే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌. ద‌ట్టంగా మంచు కురుస్తోంది. అలాంటి వాతావ‌ర‌ణంలో దుస్తులు ధ‌రించి కూడా బ‌య‌ట కొంత సేపు గ‌డ‌ప‌లేం. అలాంటి వారు ఏకంగా చెడ్డీల మీద బికినీ పార్టీ చేసుకున్నారు. అవును నిజ‌మే.

few siberian youth celebrated bikini party at -39 degrees temperature

సైబీరియాలోని టామ్‌స్క్ అనే సిటీలో న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా సెంట్ర‌ల్ స్క్వేర్ అనే ప్రాంతంలో ఓ చెట్టును సుంద‌రంగా ముస్తాబు చేశారు. అయితే ఆ ప్రాంతంలో తాజాగా -39 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. అందులో భాగంగానే అక్క‌డి ప్ర‌భుత్వం పౌరుల‌కు హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. అయితే దీన్ని ప‌ట్టించుకోని కొంద‌రు యువ‌తీ యువ‌కులు అక్క‌డ పార్టీ చేసుకున్నారు. బికినీలు, చెడ్డీలు ధరించి మంచులో ఎగురుతూ ఎంజాయ్ చేశారు.

అయితే వారు ఓ వ్య‌క్తికి సంబంధించిన బ‌ర్త్ డే పార్టీని ఇలా వెరైటీగా ఉంటుంద‌ని సెల‌బ్రేట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కానీ కొంద‌రు మాత్రం దీనిపై విమ‌ర్శిస్తున్నారు. మీకు పిచ్చిగానీ ఏమైనా ప‌ట్టిందా, అంత‌టి త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లో ఒంటిపై దుస్తులు లేకుండా పార్టీలా ? అని కామెంట్లు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ వారు ఆ కామెంట్ల‌ను పట్టించుకోవ‌డం లేదు. అవున్లే.. ఎవ‌డి పిచ్చి వాడికి ఆనందం అని ఊరికే అన‌లేదు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news