సవతుల పోరు.. తల్లీకొడుకు సజీవదహనం

తమిళనాడులోకి కృష్ణగిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సవతుల మధ్య జరిగిన పోరులో తల్లీకొడుకు సజీవదహనం అయ్యారు. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్ పట్టికి చెందిన సెందామరై కన్నన్ (55 ఏళ్లు) వీధి నాటకంలో నటిస్తుంటాడు. ధర్మపురి జిల్లా స్వామియార్ పురానికి చెందిన సెల్విని మొదటగా వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ తర్వాత సెందామరై కన్నన్ కీల్‌కుప్పం ప్రాంతానికి చెందిన కమల (47 ఏళ్లు)తో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నాడు. వీరిలో కుమార్తెకు వివాహం జరిగింది. కుమారుడు గురు (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.

death
death

అయితే ఈ క్రమంలో సెందామరై.. సత్య (30 ఏళ్లు) అనే మహిళతో మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముత్తు అనే కుమారుడు పుట్టాడు. ఈ క్రమంలో రెండో భార్య కమల, మూడో భార్య సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తల్లి కమల, గురు నిప్పంటించుకుని సజీవదహనం అయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.