గుణ 369, రాక్ష‌సుడు ఫిలిం న‌గ‌ర్ టాక్ ఏంటంటే?

-

యువ హీరోలు బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ న‌టించిన రాక్ష‌సుడు, కార్తికేయ న‌టించిన గుణ 369 ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్ల‌కొండ స‌క్సెస్ కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నాడు. ఈ హిట్ తో మార్కెట్ లో నిల‌బ‌డాల‌ని ఆరాట ప‌డుతున్నాడు. ఇక కార్తికేయ తొలి హిట్ తో నిరూపించుకున్న హిప్పీ తీవ్ర నిరాశ‌లోకి నెట్టేసింది. దీంతో గుణ 369 కీల‌క సినిమా అయింది. చేతిలో కొత్త అవ‌కాశాలు కూడా లేని నేప‌థ్యంలో గుణ స‌క్సెస్ అవ్వాల్సిన స‌న్నివేశం ఏర్ప‌డింది. మ‌రి ఈ ఇద్ద‌రి హీరోలు గెలుపు గుర్రం ఎక్కుతారా? లేదా? అన్న‌ది శుక్ర‌వారం తేలిపోనుంది.

Filmnagar Talk on guna 369 and rakshasudu movie

అయితే అంత‌కు ముందే ఈ సినిమాల‌కు సంబంధించి ఫిలిం గ‌న‌ర్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గుణ‌ యావ‌రేజ్ టాక్ ను తెచ్చుకుంది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌ని పాత క‌థ‌నే మిక్సీ వేసి తిప్పిన‌ట్లు చెబుతున్నారు. షరా మూలులుగా భారీ ఫైట్లు ఉన్నాయ‌ట‌. అయితే ద్వితాయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు హైలైట్ గా ఉన్నాయంటున్నారు. ఇంట‌ర్వెల్ స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టించాయట‌. ఫైనల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గా నిలిచే అవ‌కాశం ఉందంటున్నారు. ఇక రాక్ష‌సుడు విష‌యానకొస్తే!
ప్ర‌ధమార్దం ఒకే అట‌. ద్వితియార్థం కంటే బెట‌ర్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

చివ‌రి 30 నిమిషాలు హైలైట్ గా ఉంటుంద‌ని వినిపిస్తోంది. సినిమా అబౌ యావ‌రేజ్ నుంచి హిట్ రేంజ్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. క‌థ‌లో పాయింట్ కొత్తంగా ఉందిట‌. దాన్ని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు పెద్ద ఎత్తున మార్పులు చేసారుట‌. ఫ్రెష్ గా తమిళ్ లో విడుద‌ల చేసినా కొత్త అనుభూతినిస్తుందంటున్నారు. మరి టాక్ లో నిజ‌మెంత‌? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ప్ర‌స్తుతం రెండు సినిమా యూనిట్లు ప్ర‌చారం ప‌నుల్లో బిజీగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version