ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్… 90 నిమిషాల్లోనే డెలివరీ

-

నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సరికి కావల్సిన ప్రతి వస్తువు ఇపుడు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇంట్లో నుంచి కాలు బయట అడుగుపెట్టకుండా మనకు కావాల్సిన వస్తువు మన చేతికి వస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా కొన్ని వందల కంపెనీలు ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే మనం ఆర్డర్ చేసిన వస్తువు రావడానికి మాత్రం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. వెంటనే కావాలంటే మాత్రం మళ్ళీ ఇంట్లో నుంచి కాలు బయటపెట్టక తప్పదు.

అయితే ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే వస్తువు ఇంటికి చేరేలా ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ గతంలో ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెల్సిందే.అయితే గత ఏడాది బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. కాగా ప్రస్తుతం ఆ సేవలను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరో ఆరు నగరాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, పుణెల్లోనూ ఈ సేవలు అందించనున్నట్లు చెప్పింది.

కాగా హైదరాబాద్‌ నగరంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఆర్డర్‌ చేసిన 90 నిముషాల్లోనే డెలివరీ కానుంది. తాజా పండ్లు, కూరగాయలు, డైరీ, మాంసం, గ్రోసరీ, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బేబీ కేర్‌ సహా మొత్తం 3,000కు పైగా ఉత్పత్తుల్ని ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ ద్వారా వేగంగా డెలివరీ చేస్తామని ఆ సంస్థ వెల్లడించింది. కాగా వినియోగదార్లు తమ వీలును బట్టి సమయాన్ని ఎంచుకుంటే ఆ సమయంలోనే డెలివరీ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version