తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలో 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీతో ఏటా 50 వేల ఉద్యోగాలు అందిస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సమరంలో నడిపిన యంగ్ ఇండియా పత్రిక పేరును స్కిల్ యూనివర్సిటీ కి పెట్టామన్నారు. ముచ్చర్లలో 150 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని… ఏడాదికి 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి.