ఇవాళ తెలంగాణ ప్రభుత్వ 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీలకు 56 వేల కోట్లు బడ్జెట్ లో పెడుతున్నట్లు ప్రకటన చేశారు. 2025 26 ఆర్థిక సంవత్సరానికి ఆరు గ్యారంటీలకు రూ. 56,084 కోట్లు కేటాయించారు. మైనార్టీల సంక్షేమానికి రూ. 3591 కోట్లు కేటాయించారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క.
ఇక అటు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,79,751 అటూ డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం… తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కాగా వృద్ధిరేటు 9.6 శాతంగా ఉందని తెలిపారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ తలసరి ఆదాయం 2,55,079 కాగ వృద్దిరేటు 8.8 శాతంగా ఉందని వివరించారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క.