మనం మన కుటుంబం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం. ఎంత వెనక్కి వెసుకుంటాం తెలుసుకోవచ్చు. ఈ నియమం ప్రకారం పన్ను చెల్లించాక మిగిలిన ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించి ప్రణాళిక వెసుకోవాలి.
- ఈ నియమం ప్రకారం 50 శాతం ఆదాయాన్ని మన అవసరాలకు ఉపయోగించుకోవాలి. అంటే ఈఎంఐ, వాహన, విద్య, ఆరోగ్య ఇతర ఖర్బులకు కొనసాగించాలి.
- 30 శాతం తప్పనిసరి అవరాలు కాదు. ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాలు, ఆటలుపాటలు ఈ విభాగంలోకి వస్తాయి. కొత్త గ్యాడ్జెట్‌లు, ఖరీదైన కారు మొదలైనవి.
- 20 శాతం పొదుపు చేసుకోవాలి. అంటే మీరు సంపాదించిన మొత్తంలో పెట్టుబడులకు, అత్యవసరనిధి, మ్యూచువల్ ఫండ్లు ముందుగా తీర్చేయాలి. సమయానికి చెల్లించాల్సినవి ముందుగానే చెల్లించాలి. దీంతో రుణభారం కూడా తగ్గించుకునే చెల్లింపులను పొదుపుగా పరిగణించవచ్చు.
ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ.40 వేల ఆదాయం పొందుతే అందులో కుటుంబ ఖర్చులు, వైద్యం, ఇంటి అద్దె, ఇతర వాయిదాలన్ని యాబై శాతం అంటే 20 వేల లోపు ఉండేలా చూసుకోవాలి. ఇతర అవసరాలకు 12 వేలు ఖర్చు చేయవచ్చు. మిగిలిన 20 శాతం అంటే రూ.8 వేలు పొదుపు చేసుకోవచ్చు. ఈ విధానం అందరికీ వర్తింస్తుందని చెప్పలేం. వ్యక్తులు తమ అవసరాలను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పొదుపు విషయంలో ఏదైన సమస్యలు ఉంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించవచ్చు. దీన్ని పాటించి మీ జీవనాన్ని సజావుగా సాగదీసుకోండి. సాధ్యమైనంత వరకు అనవసర ఖర్చులను తగ్గించుకోవడమే మేలు. అప్పుడే ఖర్చులు తగ్గి ఆనందంగా ఉండవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే దుప్పటి ఉన్నంత వరకే కాళు చాచుకోవడం మంచిది అంటారు మన పెద్దలు. ఇది నిజమే. అనవసర ఖర్చులకు పోకండి అప్పులపాలు కాకండి.