తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు అవుతోంది అయినా.. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహాలు ఇచ్చారని.. కానీ మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు.
తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడని.. ప్రస్తుత సీఎం జగన్‌కు స్వయానా బాబాయ్ అని చెప్పారు. అలాంటి తమకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితేంటని ఆమె ప్రశ్నించారు. నాన్న అందరితో ప్రేమగా మెలిగేవారు.. ఆయనకు శత్రువులు ఎవరూ లేరు ఆర్థిక పరమైన కారణాలతో హత్య జరిగి ఉంటుందని అనుకోవడం లేదని నాకు తెలిసినంత వరకు ఇది రాజకీయ హత్య కూడా కాదని సునీతారెడ్డి అన్నారు. అయితే జగన్ ఈ కేసు దర్యాప్తులో సహకరించడం లేదా అని కొందరు విలేఖరులు ప్రశ్నించగా దానికి ఆమె వారినే అడగాలని బదులిచ్చారు.