BREAKING: బీజేపీ ఎమ్మెల్యేపై FIR నమోదు

-

కర్ణాటకలో ప్రజాప్రతినిధి MLA పైన FIR నమోదు అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాలలోకి వెళితే, బెల్తంగడి తాలూకా లోని ఒక నిషిద్దమైన ప్రాంతంలో ఉన్న అడవి భూమిని ఒక వ్యక్తి ఆక్రమించుకుని ఇంటిని కట్టడానికి నిర్ణయించుకున్నాడు. నిర్మాణం కూడా స్టార్ట్ చేశాడు.. ఈ విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి అక్కడకు చేరుకున్నారు. ఇంతలో సడెన్ గా ఎమ్మెల్యే హరీష్ ఆ వ్యక్తి తరపున మాట్లాడడానికి వచ్చాడు. చర్చ జరుగుతున్న సమయంలో మాటా మాటా పెరిగి బీజేపీ ఎమ్మెల్యే అధికారులను దూషించాడు. అసలే ప్రభుత్వ అధికారులు కావడంతో అన్యాయంగా తమను దూషించిన కారణంగా ఎమ్మెల్యే హరీష్ పై కేసు పెట్టడంతో, ఎటువంటి ఆలోచన లేకుండా పోలీసులు అతనిపై FIR నమోదు చేశారు. ఈ విషయం ప్రస్తుతం కర్ణాటక రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ ఎమ్మెల్యేలు ఇంతకు తెగిస్తారా ? ప్రభుత్వ అధికారులను తిడతారా? అంటూ అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news