తెలంగాణాలో బీజేపీకి జనసేన మద్దతిస్తుందా ?

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ మీద నిలబడ లేని నాయకుడిగా ప్రజలకు బాగా అలవాటు అయిపోయాడు. తెలంగాణాలో మరో నలభై రోజుల్లో జరగనున్న ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ రోజు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు మేము తెలంగాణాలో పోటీ చేసేది లేదన్నది మూడు రోజుల్లో చెబుతామని చెప్పడం హాస్యాస్పదమగా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జనసేన మద్దతు కావాలంటూ ఈ రోజు కలిసి అడిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ వెంటనే పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.

ఈ మాటలకూ అర్ధం ఏమిటి ? మద్దతు ఇస్తారా లేదా ? ఒక పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే తన మనసులో మద్దతివ్వాలని ఆలోచన ఉంటే చెప్పడానికి మళ్ళీ పార్టీనేతలతో చర్చించి చెబుతామని అనడం ఎందుకంటూ విమర్శిస్తున్నారు. మరి జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుందా ?

Read more RELATED
Recommended to you

Latest news