విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది. జక్కంపూడిలో గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద నిన్న దేవినేని ఉమామహేశ్వరరావు తన అనుచరులతో కలిసి ధర్నా నిర్వహించారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న దేవినేని ఉమ తో షా బాద్ గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.
అయితే ఇది నిన్న జరగా తను ఉమా భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమా మీద పై 505 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిన్న జక్కంపూడి షాబాద్ గ్రామ పరిధిలోని టిడ్కో గృహాలను పరిశిలించడానికి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. అయితే ఉమా వెంట వచ్చిన స్ధానిక టిడిపి నేతలను అడ్డుకునేందుకు స్ధానిక వైసిపి నాయకులు యత్నించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.