ఐపీఎల్ ప్రిడిక్షన్:సన్ రైజర్స్ దే కప్…!

ఐపీఎల్ 2020లో కప్ గెలిచే జట్టు ఏది..? ఫైనల్ చేరే జట్టేది..? ఇప్పుడే చెప్పలేం కదా. ముంబై ఇండియన్స్‌ను టైటిల్ ఫేవరేట్స్‌గా పరిగణిస్తున్నా.. చివరి మ్యాచ్‌ల్లో ఏం జరుగుతుందో ముందే ఊహించలేం. ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్ ముందు వరకూ ప్లేఆఫ్ చేరే చివరి జట్టు ఏదో కూడా క్లారిటీ లేదు. కానీ ఓ యువ ఆస్ట్రాలజర్ మాత్రం సన్‌రైజర్స్ కప్ కొడుతుందని జోస్యం చెబుతున్నాడు. ఆ మాట చెప్పింది ఇప్పుడు కాదు.. ఐపీఎల్ ప్రారంభానికి చాలా ముందే.. జులై 27న ఈ మాట చెప్పాడు.


ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో కోహ్లీ యావరేజ్‌గా ఆడతాడని.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరవని.. రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉంటుందని ట్వీట్‌ చేశాడు. అలాగే.. సన్‌రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని.. ముంబై, ఢిల్లీతోపాటు ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని జులై 27న మితుల్ అనే ఆస్ట్రాలజర్ ఓ ట్వీట్ చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరదని స్పష్టంగా చెప్పాడు. ఇప్పటి వరకూ తాను చెప్పిన వాటిలో నిజమైనవాటికి రైట్ టిక్ కొడుతూ.. ఇక నిజం కావాల్సింది ఇదొక్కటే అన్నట్టుగా సన్‌‌రైజర్స్ టైటిల్ గెలుస్తుంది అన్నదానికి ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి తాజాగా మరో ట్వీట్ చేశాడు. మిథుల్ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అతణ్ని ఆకాశానికి ఎత్తేస్తూ.. తమ జట్టే కప్ కొడుతుందని నమ్మకంతో ఉన్నారు. కోహ్లీకి వీరాభిమాని అయిన ఈ యువకుడికి ట్విట్టర్లో ఫాలోవర్లు భారీగా పెరుగుతున్నారు.