పట్టిసీమ వద్ద భారీ అగ్నిప్రమాదం…!

ఆంధ్రప్రదేశ్ లో తొలి నదుల అనుసంధానం ప్రాజెక్ట్… పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పవర్ ప్లాంట్ 48/60 MG, ట్రాన్స్ఫర్ వద్ద అకస్మాత్తుగా మంటలు భారీగా చెలరేగాయి… అందుబాటులో అగ్నిమాపక కేంద్రం లేక పోవడంతో సుమారు గంటకు పైగా అక్కడ మంటలు చెలరేగుతున్నట్టు తెలుస్తుంది. పవర్ స్టేషన్ లో ఉన్న ట్రాన్స్ఫర్ 3 గాను ఒకటి పూర్తిగా కారిపోయింది. ఏ సమయానికి ఏ విధంగా పేలనున్నాయో తెలియక పవర్ ప్లాంట్ ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడు ఏమో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయినా పోలవరం ప్రాజెక్టు ఉన్నప్పటికీ పోలవరంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో అక్కడి ప్రజలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా సరే… సుమారు 30 కిలోమీటర్ల దూరం గోతుల రోడ్లలో అగ్నిమాపక వాహనం ప్రయాణం చేసి ఇక్కడకు చేరుకునే సమయానికి జరగవలసిన నష్టం జరుగుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం వేగంగా స్పందించి… పోలవరం లోని అగ్నిమాపక కేంద్రం నియమించవలసిందిగా పోలవరం ప్రజలు కోరుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ మీద… నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్ట్ వద్ద భద్రతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. గోదావరి గట్టు మీద ఉన్న రోడ్డు మీద నుంచే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏవైనా ప్రమాదాలు జరిగినా సరే వేగంగా స్పందించే అవకాశం అక్కడ లేదు… సమీపంలో ఉన్న కొవ్వూరు నుంచి అక్కడికి రావడానికి దాదాపు గంటకు పైగా సమయం పడుతుంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.