సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూస్తే కన్నీళ్లు ఆగవు…!

టీం ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్… వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో యాక్టివ్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత సోషల్ మీడియాలో వీరు ఎక్కువగా హడావుడి చేస్తున్నాడు. తన కామెంట్లు, ట్వీట్లు, పోస్టులతో అభిమానులను అలరిస్తున్నాడు ఈ నజఫ్ గడ్ నవాబ్. ఇక ఆయన సమాజానికి పనికొచ్చే విధంగా, పలువురి ఆదర్శం నింపే విధంగా వీరు ట్వీట్లు చేస్తూ ఉంటాడు. దీనితో సోషల్ మీడియాలో అతనికి ఈ మధ్య మరింత క్రేజ్ పెరిగిపోయింది అనే చెప్పుకోవచ్చు.

క్రికెట్, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, ఉద్యోగ అంశాలు, వ్యక్తిగత అంశాలు, తన కుటుంబంలో జరిగే సంభాషణలు, గత జ్ఞాపకాలు ఇలా ఏదొకటి వీరు పోస్ట్ చేస్తూనే ఉంటాడు. కొన్ని కొన్ని సంఘటనలపై వీరు పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేస్తూ సందడి చేస్తూ ఉంటాడు. కొన్ని ఆసక్తికర వీడియోలను కూడా వీరు పోస్ట్ చేస్తాడు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సరిబేసి విధానంపై కూడా తనదైన శైలిలో వీరు వ్యాఖ్యలు చేసి ఆకట్టుకున్నాడు. తాజాగా వీరు తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసాడు.

ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే… న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ ఫొటోని వీరు ట్వీట్ చేసాడు. ఓ అమర జవాన్ అక్కడున్న అమర జవాన్ల బోర్డ్ మీద తన కుమారుడి పేరుని ముద్దాడుతూ, ఉద్వేగానికి గురవుతూ ఉంటారు… ఈ ఫోటోని పోస్ట్ చేసిన వీరు… ‘‘మాటలు రావడం లేదు. ప్రేమ, గౌరవాలు తప్ప. గర్వంతో పాటు మరెంతో.. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర తనయుడి పేరును ముద్దాడుతూ ఓ అమర జవాన్ తండ్రి..’’ అని కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని ఊపేస్తుంది.