మధ్యప్రదేశ్ లోని బాణసంచా ఫ్యాక్టరీ లో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది వివరాల్లోకి వెళితే,, మధ్యప్రదేశ్లోని మగర్థ రోడ్ లో ఉన్న అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈరోజు పేలుడు సంభవించింది భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో బాణసంచా తయారీకి ఉంచిన గన్ పౌడర్ కారణంగా మంటలు కొద్దిసేపటికే భారీ రూపం దాల్చాయి సమీపంలో ఉన్న 50కి పైగా ఇళ్ళు కాలిపోయాయి దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది పార్టీ నుండి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియలేదు. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలని కోల్పోయే అవకాశమునట్లు తెలుస్తోంది గాయపడిన వాళ్లని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేసింది ఫ్యాక్టరీ కి వెళ్లే దారిలో బ్యారిగేట్లు వేసి సామాన్య ప్రజల రాకపోకలని పోలీసులు నిలిపివేశారు.