హనుమాన్ న్యూ రికార్డ్.. రిలీజ్ అయిన నెలలోపే రూ.300 కోట్ల కలెక్షన్స్

-

టాలీవుడ్ యంగ్ టాలెంట్ తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’. విడుదలకు ముందు నుంచే సూపర్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ టాక్ను సంపాదించుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన హనుమాన్ తాజాగా మరో సరికొత్త మైలురాయిని చేరుకుంది.

విడుదలైన 25 రోజుల్లో రూ.300కోట్లు వసూళ్లు చేసి మరో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్. ఈ ఏడాదిలో రూ.300 కోట్లు సాధించిన మొదటి సినిమాగా రికార్డును నెలకొల్పింది. దీనిపై దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘హనుమాన్‌’ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ చిత్రానికి ఎంతోమంది వారి హృదయాల్లో స్థానం కల్పించారు. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు దీన్ని వీక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు’ అని ప్రశాంత్ వర్మ పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news