టపాసులు అమ్మనివ్వకపోతే ఆత్మహత్యలే !

-

దీపావళి బాణాసంచా వినియోగంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసులు బ్యాన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో బంజారాహిల్స్ సాగర్ సొసైటీ మైదానంలో క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దీపావళికి 2వందల కోట్ల రూపాయల టపాసుల టర్నోవర్ జరుగుతుందని, 50 ఏళ్ల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నమాని ఈరోజు హైకోర్టు తీర్పు తమను కలచి వేసిందని అన్నారు.

బ్యాన్ చేసేది ఉంటే ఫైర్ అనుమతులు ఎందుకు ఇచ్చారు ? అని సభ్యులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, హైకోర్టు తీర్పు హోల్ సేల్ వ్యాపారులకు ఆరు నెలల కింద చెప్పి ఇచ్చి ఉంటే బాగుండనునని అన్నారు. రెండు రోజులు పాటు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. రెండు రోజులు అవకాశం ఇస్తే తమ సరుకు అమ్ముడుపోయి.. అప్పులు తీరుతాయని అన్నారు. ఈ సరుకును ఎక్కడ నిల్వ ఉంచాలి ? గోదాములో ఉంచితే అక్రమమైందని సీజ్ చేసే ప్రమాదం ఉందని వారు వాపోయారు. ఈ రెండు రోజులు అనుమతి ఇవ్వకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version