వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు చెందిన ఫాం హౌస్ సెక్యూరిటీ అధికారిని అరెస్ట్ చేశారు. ఫాం హౌస్ ఇంఛార్జి ఉమర్ అరెస్ట్ చేసిన పోలీసులు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద విచారణ చేస్తున్నారు. 4 రోజుల క్రితం గేదెను కాల్చిచంపిన ఉమర్ ఆ తరువాత మరో ఆవుని కూడా పొట్టన పెట్టుకున్నట్టు గుర్తించారు. ఈ విషయం ఈరోజు ఉదయమే వెలుగులోకి వచ్చింది.
అయితే అప్పుడు ఒక క్రీడాకారిణి అంటూ మీడియా కధనాలు వేలువరించగా ఆమె సానియా మీర్జా అని తేలింది. ఇక దామగుండంలో ఓ సానియాకి, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. ఈ ఫాం హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ముందు ఆరోపించారు. ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని పోలీసులు విచారించగా ఫామ్ హౌజ్ నిర్వకులు స్థానికులను బెదిరిస్తున్నట్టు గుర్తించారు.