తెలంగాణలో మొదటి టీకా ఎవరికో తెలుసా ?

-

దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్‌ మొదలుకానుంది. దీనిలో భాగంగా తెలంగాణకు 3.64 లక్షల కోవిషీల్డ్ డోసులు వచ్చాయి. తొలిదశ టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి 6.5 లక్షల టీకా డోస్ లు వస్తాయని భావించగా కేవలం 3.64 లక్షల కోవిషిల్డ్ డోసులు చేరుకున్నాయి. అయితే మరో 20 వేల కోవాగ్జిన్ డోసులు రాష్ట్ర వాక్సిన్ స్టోరేజ్ కేంద్రానికి చేరుకున్నాయి. అయితే మొదటి డోసు మాత్రం సఫాయి కర్మ చారి(పారిశుధ్య కార్మికునికి) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 139 సెంటర్లలో మొదటి రోజు ఒక్కో సెంటర్ లో 30 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నారు. మొదట ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు తర్వాత ప్రయివేట్ హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయనున్నారు. రెండవ రోజు 50.. ఆ తర్వాత రోజు 100 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. అలా అంచెల వారీగా వాక్సిన్ డోసులను పెంచనున్నారు. ఇక ఈ వ్యాక్సిన్ కోసం తెలంగాణలో ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది హెల్త్ కేర్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news