500 ఏళ్ల తర్వాత అయోధ్యలో తొలి దీపావళి.. మోడీ ఏమన్నారంటే?

-

అయోధ్యలో ఇటీవల నిర్మించిన బాల రాముడి మందిరంలో 500 ఏళ్ల తర్వాత తొలిసారి దీపావళి వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ భారీగా ఏర్పాట్లు చేసింది. 2024 జనవరి 22న అయోధ్య టెంపుల్లో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించాక వచ్చిన తొలి దీపావళి కావడంతో తీర్థక్షేత్ర ట్రస్టుతో పాటు యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

రామమందిరంతో పాటు పరిసర ప్రాంతాలను దీపాలతో ప్రత్యకంగా అలంకరించారు.ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఈసారి రామమందిరంలో వేడుకలు చరిత్రాత్మకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రామ్‌లల్లా తన సొంతింటికి వచ్చాక జరుగుతున్న తొలి దీపావళి వేడుకలు అని, ఈ తరుణం కోసం ఎన్నో తరాలు వేచి చూసినట్లు తెలిపారు. అయోధ్య రాముడి సన్నిధిలో దీపావళి వేడుకలు కళ్లారా చూడాలని ప్రజలు తరతరాలుగా వేచి చూశారని, మొత్తానికి వారి ఆశలు ఫలించాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version