భక్త కన్నప్ప నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

-

గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న మంచు విష్ణుకి సక్సెస్ అందకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అనుకోవాలని భావిస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భక్త కన్నప్ప.

మంచు విష్ణు కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్‌. ఇక ఈ చిత్రం నుంచి శివరాత్రి సందర్భంగా ఓ పోస్టర్ ను హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ‘పరమ శివుడి గొప్ప భక్తుడు అయిన ‘కన్నప్ప’. పాత్రను నేను పోషించడాన్ని గౌరవంగా భావిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇదిగో మీ కన్నప్ప’ అంటూ విల్లుతో బాణం వదులుతున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేశారు.ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్,మోహన్ లాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ సినిమాని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news