మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి .ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారం చేపట్టాలని కసరత్తులు చేస్తోంది .అందులో భాగంగా ఇప్పటికే పలు సినీ, క్రికెటర్స్ కి ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్లు కేటాయిస్తూ ఉంది. తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి టికెట్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది.ఆయన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై బిజెపి నాయకులు ఇప్పటికే చర్చలు జరిపారని తెలుస్తుంది. అంతేకాకుండా వారి ప్రతిపాదనకు షమీ కూడా పాజిటివ్గా స్పందించినట్లు తెలుస్తోంది.
బసిర్‌హట్ నియోజకవర్గం నుంచి షమీకి టికెట్ను కేటాయించాలని భావిస్తుంది. ఇదిలా ఉంటే మహమ్మద్ షమి గాయం కారణంగా క్రికెట్కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అతనికి లండన్ లో శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి, T20 ప్రపంచ కప్ కి దూరం కానున్నాడు.