రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కవిత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….ఉచిత సిలిండర్లు, నెలకు రూ. 1,000 ఇవ్వడం ద్వారా మహిళల జీవితాలు మారవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘నిజంగా మహిళలను పైకి తీసుకురావాలంటే వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని సూచించారు.
ప్రతినెలా స్థిరమైన ఆదాయం వచ్చేలా తయారు చేయాలి అని, అదే నిజమైన మహిళా సాధికారత అని అన్నారు. అందుకే జీవో నంబర్-3ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ జీవో వల్ల ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోంది’ అని తెలిపారు.1996 లో పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు అని ఆమె గుర్తు చేశారు.