మూఢవిశ్వాసాలకు పరాకాష్ట.. పెళ్లికూతురు కన్యత్వ పరీక్ష…

-

నేటి అత్యాధునిక సమాజంలో.. రోజు రోజు టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇంకా మూఢనమ్మకాల పెనుభూతంలోనే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్​లో మూఢవిశ్వాసాలు మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంధ విశ్వాసాలను పాటిస్తూ.. మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు. భిల్వారాలోని శాంసీ ప్రాంతంలో ఓ మహిళ ఇదే తరహాలో వివక్షకు గురవుతోంది. వివరాల్లోకి వెళితే… శాంసీలో నివసించే మహిళపై పొరిగింటి వ్యక్తి గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే.. ఆమెతో పాటు, ఆమె తోబుట్టువులను సైతం చంపేస్తానని బెదిరించాడు.

This 400-year-old custom still forces virginity tests on brides in India |  Business Standard News

దీంతో బాధితురాలు దీని గురించి ఎవరికీ చెప్పలేదు. కొద్దిరోజుల తర్వాత ఆమెకు వివాహం జరిగింది. అయితే, అక్కడి ఆచారాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత.. మహిళకు కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు. తొలిరాత్రి మహిళకు రక్తస్రావం జరిగితేనే ఆమె కన్య అని నమ్ముతారు. ఈ విషయం అందరికీ తెలిసేలా.. తొలిరాత్రి రోజు బెడ్​పై పరిచిన తెల్లని గుడ్డను బహిరంగంగా చూపిస్తారు.దీంతో అత్యాచారానికి గురైన బాధితురాలిపై తన భర్త అనుమానాలు వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులంతా ఆరా తీయగా.. జరిగిన విషయాన్ని చెప్పేసింది ఆ మహిళ. రేప్ చేసిన వ్యక్తిపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పంచాయతీ పెద్దలు మాత్రం బాధితురాలినే.. దోషిని చేశారు.

పెళ్లి చేసుకున్నయువకుడికి అన్యాయం చేశారన్న ఆరోపణలతో ఈ విషయంపై శుక్రవారం పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. పెద్దలంతా చర్చించి బాధితురాలి కుటుంబానికి జరిమానా విధించనున్నారు. సాధారణంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమామా విధిస్తుంటారు. డబ్బు కట్టకపోతే గ్రామం నుంచి వెలివేస్తారు. కొందరైతే ఉన్నఆస్తులన్నీ అమ్మేసుకొని జరిమానా కట్టేందుకు ప్రయత్నిస్తారు.

అయితే, స్థానిక సామాజిక కార్యకర్తలు ఈ సంప్రదాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించే అధికారం ఏ పంచాయతికీ లేదని సామాజిక కార్యకర్త సుమన్ దేవతియా పేర్కొన్నారు. పంచాయతీల నిర్ణయాలు చట్టబద్ధమైనవి కాదని చెప్పారు. ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ విషయాలపై నిర్ణయాలు తీసుకోలేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news