రూ.100 పొదుపుతో.. ఒకేసారి రూ.5 లక్షలు..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. అయితే ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన చక్కటి లాభాలు కలుగుతాయి. వేతన జీవులు, అసంఘటిత రంగాల కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత భాగాన్ని సేవ్ చేయాలనీ అనుకుంటున్నారు. రిస్క్ లేకుండా ఉండేలా చక్కటి లాభం కలిగే మార్గం గురించి చూద్దాం. ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ వడ్డీ ని అందించే స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ దానిలో ఒకటి. ఈ పథకంలో చేరితే చక్కటి లాభాలని పొందవచ్చు. ఎంచుకునే టెన్యూర్, ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా డబ్బులు వస్తూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇంకో నాలుగు బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ని చూస్తే.. రికరింగ్ డిపాజిట్లపై 6.8 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఒకసారి చేరిన తర్వాత నెల నెలా పే చేయాల్సిన డబ్బులు లెట్ అయితే పెనాల్టీ పడుతుంది.

ఆరు నెలల వరకు డబ్బులు కట్టకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
లో రికరింగ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ వస్తోంది. 120 నెలల టెన్యూర్లకు ఇది వర్తిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు లో అయితే వడ్డీ రేట్లు 7.25 శాతం వరకు ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు
లో 4.75 శాతం నుంచి 7.1 శాతం వరకు ఉండి. సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. వడ్డీ రేటు 7 శాతం కింద చూస్తే… నెలకు మీరు రూ3 వేల చొప్పున డిపాజిట్ చేస్తే.. పదేళ్ల తర్వాత ఒకేసారి రూ. 5.2 లక్షలు వస్తాయి. మీరు రోజుకు రూ.100 మాత్రమే పొదుపు చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news