దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు నడిపేందుకు కూడా మొగ్గు చూపడం లేదు. బస్సు ప్రయాణమే మేలని చాలా మంది భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినా.. ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు తెలుసుకుందాం. తమిళనాడు రాజధాని చెన్నై పట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.11 ఉండగా.. డీజిల్ ధర రూ. 86.58 వద్ద కొనసాగుతోంది. కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.94.22 ఉండగా.. డీజిల్ ధర రూ.86.37గా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 ఉండగా.. డీజిల్ ధర రూ.81.47గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.57 గా ఉండగా.. డీజిల్ ధర రూ.88.60గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో శుక్రవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 ఉండగా, డీజిల్ ధర రూ. 88.86గా ఉంది. వరంగల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.94.37 ఉండగా.. డీజిల్ ధర రూ.88.45గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.00 ఉండగా.. డీజిల్ ధర రూ.90.82గా కొనసాగుతోంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.55 ఉండగా.. డీజిల్ ధర రూ.90.35గా కొనసాగుతోంది.
గతకొద్ది రోజులు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే యోచన కనిపిస్తోంది. ఇంధన ధరలు కొంతమేర తగ్గినట్లే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది. ధరలు స్థిరంగా కొనసాగుతాయా.. తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే విషయానికి వస్తే.. ఇంకొద్ది రోజులు వేచి చూడాలి.