తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి. మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుండటంతో ప్రజల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గింది లే అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మళ్ళీ తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సిన్ వచ్చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కానీ మహమ్మారి మాత్రం మళ్లీ భయపెడుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉండటంతో సరిహద్దుల్లో కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కట్టుదిట్టంగా నడిపిస్తున్నారు. హాట్‌స్పాట్స్ నుంచి వస్తున్న వారిని పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈరోజు ఏకంగా రెండు వందలకు పైగా కేసులు నమోదు కావడం మళ్ళీ టెన్షన్ రేపుతోంది. ఏపీలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.