బ్రేకింగ్ : ఆ ఫ్లైట్స్ నిలిపివేసిన భారత్

-

ప్రపంచ దేశాలను ఇప్పుడు కొత్త వైరస్ కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. రూపాంతరం చెందిన వైరస్ శర వేగంగా వ్యాపిస్తున్నట్లు చెబుతుండడంతో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటలీలో బ్రిటన్  తరహా..కరోనా స్ట్రెయిన్ బాధితుడిని గుర్తించారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 22వ డిసెంబర్, 23 : 59 గంటలు ప్రారంభించి డిసెంబర్ 31 వరకు యుకె నుండి ఇండియాకు వచ్చే అన్ని విమానాలను భారత్ నిలిపివేసింది.

22 డిసెంబర్, 23 : 59 గంటలకు ముందు యుకె విమానాలకు ద్వారా వచ్చే ఎవరైనా భారత విమానాశ్రయాలకు చేరుకున్నప్పుడు తప్పనిసరి ఆర్టిపిసిఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక మరో పక్క బ్రిటన్ ప్రధాని, బోరిస్ జాన్సన్ లండన్ తో పాటు ఆగ్నేయ ఇంగ్లండ్ మొదలగు ప్రాంతాల్లోలాక్డౌన్ విధించారు. క్రిస్ మస్ దగ్గర పడుతున్న క్రమంలో కరోనా కొత్త రూపం మరింత విజృంభిస్తుందన్న ఆలోచనతో లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుండి వచ్చే విమానాలు గానీ, బ్రిటన్ కి వెళ్ళే విమానాలను నిషేధించారు.

Read more RELATED
Recommended to you

Latest news