ఫ్లిప్‌కార్ట్‌లో రేప‌టి నుంచి ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌.. 80 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌లు..

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిసెంబ‌ర్ 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు 3 రోజుల పాటు ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఇక‌పై ప్ర‌తి నెలా మొద‌టి మూడు తేదీల్లో ఈ సేల్ ఉంటుంద‌ని ఆ సంస్థ తెలియ‌జేసింది. సేల్‌లో భాగంగా అన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌పై వినియోగ‌దారులు భారీ డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.flipkart.com/flipstart-days-store అనే సైట్‌ను క‌స్ట‌మ‌ర్లు సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌లో ఎల‌క్ట్రానిక్స్, యాక్స‌స‌రీస్‌పై 80 శాతం వ‌ర‌కు రాయితీల‌ను పొంద‌వ‌చ్చు. ల్యాప్‌టాప్‌ల‌ను 30 శాతం డిస్కౌంట్‌తో అందిస్తారు. స్మార్ట్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ క్లాత్స్ ను రూ.1299 ప్రారంభ ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. హెడ్ ఫోన్స్‌, స్పీక‌ర్స్‌పై 70 శాతం వ‌ర‌కు రాయితీ ఇస్తారు. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను నో కాస్ట్ ఈఎంఐ ప‌ద్ధ‌తిలోనూ కొనవ‌చ్చు. అలాగే ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందొచ్చు. కెమెరాలు, కెమెరా యాక్స‌స‌రీల‌ను రూ.799 ప్రారంభ ధ‌ర నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

మొబైల్ యాక్స‌స‌రీలు రూ.129 ప్రారంభ ధ‌ర‌కు ల‌భిస్తాయి. ఏసీలు, రిఫ్రిజిరేట‌ర్లు, టీవీల‌పై 50 శాతం రాయితీని పొంద‌వ‌చ్చు. ఫ‌ర్నిచ‌ర్ వ‌స్తువులు, స్మార్ట్ టీవీలు, ఇత‌ర గృహోప‌క‌ర‌ణాలు, దుస్తులు, ఫుట్‌వేర్‌.. ఇలా ఒక‌టేమిటి అన్ని విభాగాల‌కు చెందిన వ‌స్తువుల‌పై రాయితీల‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version