గ్రేటర్ మేయర్‌ పీఠం ఎవరిది..ఏ పార్టీ అవకాశం ఎలా ఉందంటే ?

-

జీహెచ్ఎంసీ ఎన్నికల సమరంలో ప్రచారం హోరాహోరీగా జరిగింది. యుద్ధాన్ని తలపించేలా పార్టీలు తలపడ్డాయి. మరి గ్రేటర్‌ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోనున్నారు. అసలు మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించాలనే లెక్కలు ఆసక్తి రేకిత్తిస్తున్నాయి.గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లలో కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకోనున్నారు.

గ్రేటర్‌లో మేయర్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది. అంటే కార్పొరేటర్లు, గ్రేటర్‌ ఓటు హక్కు కలిగిన ఎక్స్‌ అఫీషియో సభ్యులు కలిసి మేయర్‌ను ఎన్నుకుంటారు. 150 కార్పొరేటర్ల పాటు.. నగరంలోని ప్రజాప్రతినిధులు… గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలతో కలిసి మొత్తం 52 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. దీంతో మేయర్‌ ఎన్నికకు మొత్తం ఓట్ల సంఖ్య 202గా లెక్కతేలింది. అంటే మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే… 102 ఓట్ల బలం అవసరమవుతుంది.

పార్టీలపరంగా బలాబలాలు పరిశీలిస్తే.. ముందుగా టీఆర్‌ఎస్‌ పార్టీనే తీసుకుంటే… ఆ పార్టీకి మొత్తం 37 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ చొప్పున టీఆర్‌ఎస్ గెలవాల్సిన డివిజన్లు 65గా ఉన్నాయి. ఇక బీజేపీ,ఎంఐఎం,కాంగ్రెస్ గెలవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే.

ఇక బీజేపీ బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే… ముగ్గురు ఎక్స్‌ అఫీసియో సభ్యులున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కిషన్‌ రెడ్డికి గ్రేటర్‌లో ఓటుహక్కు ఉంది. అలాగే గోషామహల్‌ నుంచి ఎమ్మల్యేగా గెలిచిన రాజాసింగ్‌ , ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఓటు హక్కు కలిగి ఉన్నారు. కమలనాథులకు
మూడు ఓట్ల బలం అంది. అంటే గ్రేటర్‌లో మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే.. బీజేపీ 99 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉంటుంది..

కాంగ్రెస్‌ బలాబాలను ఓ సారి పరిశీలిస్తే… ఆ పార్టీకి ఒక్కరే ఎంపీ ఉన్నారు. మల్కాజ్‌గిరీ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డికి ఓటు హక్కు ఉంది. ఎమ్మెల్యేలుగానీ, ఎమ్మెల్సీలు గానీ ఆ పార్టీకి లేరు. అంటే కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు.. 101జీహెచ్‌ఎంసీ డివిజన్లలో విజయం సాదించాల్సి ఉంటుంది. ఇక గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ తర్వాత అధికంగా ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నది.. మజ్లీస్‌ పార్టీకే. ఆ పార్టీకి గ్రేటర్‌లో ఓటుహక్కు కలిగిన ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తంగా మేయర్‌ ఎన్నికలో మజ్లీస్‌ పార్టీకి 10 ఎక్స్‌ అఫీషియో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version