ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ విద్యార్థులకు సదవకాశం కల్పిస్తోంది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో 45 రోజుల పాటు పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేసే వీలును ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కకు అర్హులని తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్‌లో 45 రోజులపాటు జరగనున్న పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే విద్యార్థులకు ఆ సంస్థలో సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తారు. అలాగే వారు నూతన స్కిల్స్ నేర్చుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఈ-కామర్స్ రంగాల్లో వారికి చక్కని అవకాశాలు ఉంటాయి.
కాగా ఈ ఇంటర్న్‌షిప్‌ను ఫ్లిప్‌కార్ట్ గతేడాది కూడా నిర్వహించింది. అందులో 2వేల మంది వరకు పాల్గొన్నారు. ఈసారి హర్యానాలోని బినోలా, పశ్చిమ బెంగాల్‌లోని డంకుని, కర్ణాటకలోని మలుర్, తెలంగాణలోని మేడ్చల్‌లలో ఫ్లిప్‌కార్ట్ ఈ ఇంటర్న్‌షిప్‌ను నిర్వహిస్తోంది. ఇందుకు గాను అర్హత ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంటర్న్‌షిప్ చేసినన్ని రోజులు రోజుకు రూ.500 నుంచి రూ.600 పేమెంట్ కూడా ఇస్తారు.