రెబల్ అంటే గూబుల్ పుట్టించాలి అనే విధంగా ఉంది నర్సాపురం వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం. సొంత పార్టీపైనే అసమ్మతి జెండా ఎగరవేయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులను మించి పోయే విధంగా రఘురామకష్ణంరాజు వ్యవహారం ఉంది. నిత్యం వైసీపీపైన, జగన్ పైన , విమర్శలు చేస్తే కానీ నిద్ర పట్టదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి విషయం పైనా స్పందిస్తూ, వైసిపి నాయకులను కవ్విస్తూ వస్తున్నారు.
అసలు ఆయన బీజేపీలో చేరేందుకు, పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించినా, రఘురామకృష్ణంరాజు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అసలు ఆయన ఏ ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. పోనీ ఆయనను చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అంటే అదీ లేదు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ఒక్కడితో కంటే జగన్ తో బీజేపీకి ఇప్పుడు అవసరం వచ్చిపడింది. ఒకవేళ బీజేపీ చేర్చుకుంటే, జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తారు అనే విషయం బాగా బీజేపీ నాయకులకు బాగా తెలుసు. అందుకే రఘురామకష్ణంరాజు బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, చేర్చుకునేందుకు బిజెపి సిద్ధంగా లేదు.
బిజెపి అండదండలు తనకు లేవని తెలిసినా, అదేపనిగా వైసీపీపై విమర్శలు చేస్తూనే రాజుగారు వస్తున్నారు. ఏపీలో ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విమర్శిస్తూ, హడావుడి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇల్లు, కార్యాలయాలపై సిబిఐ దాడులు చేయడం కలకలం రేపింది. దాడులు జరగడం వెనుక బీజేపీ హస్తం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. అయినా ఆయన ఏ మాత్రం తగ్గకుండా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఈ సందర్భంగా గా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉన్నతాధికారి బ్యాచ్ మేట్ ఆర్థిక శాఖలో పని చేస్తుండటంతో, ఆయన ద్వారానే కేసులు వేయించేలా చేశారని రఘురామకృష్ణంరాజు మరోసారి మండిపడ్డారు. తాను జగన్ ను, వైసీపీని ఆషామాషీగా వదిలిపెట్టనని, తన పోరాటం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
రఘురామకృష్ణంరాజు ఈ విధంగా చాలా కాలంగా జగన్ కు, ఆ పార్టీ నాయకులకు అసహనం తెప్పిస్తున్నా, సైలెంట్ గానే అన్ని భరిస్తూ వస్తున్నారు. కాకపోతే, జగన్ తో వ్యవహారం ఎలా ఉంటుందో మిగతా రాజకీయ నాయకులకు తెలియంది కాదు. ఆయనతో పెట్టుకుంటే ఎవరికైనా ఆ స్థాయిలోనే సరదా తీర్చే చేస్తూ ఉంటారు. అయితే కాస్త వెనక ముందు అవ్వచ్చు. ఇప్పటికే అనంతపురం జిల్లా కీలక నాయకులు జేసీ బ్రదర్స్ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక రఘురామకృష్ణరాజు వ్యవహారంలోనూ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం రాజకీయ విమర్శలు చేసి కట్టడి చేసే అవకాశం లేకపోవడంతో, ఆర్థిక మూలాలను దెబ్బతీసి, గతంలో ఆయనపై నమోదైన అన్ని కేసులను బయటకు తీయించి, బిజెపి ద్వారానే రఘురామకృష్ణం రాజును కట్టడి చేయాలని అనే ప్లాంట్ తో జగన్ ముందుకు వెళ్తున్నట్టు గా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కు సంబంధించిన అన్ని వ్యవహారాలపైనా వైసీపీ ప్రభుత్వం ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఒక్కో అస్త్రాన్ని బయటకు తీసి, జగన్ తో అనవసరంగా పెట్టుకున్నాను అనేలా చేయడంతో పాటు మిగతా ఎవరైనా రాజు గారి మాదిరిగా తనతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అనేది చూపించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లుగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.