గ్రేటర్ హైదరాబాద్ లో వరదలు మిగిల్చిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరద సహాయం కోసం ఎందరో ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో వరద సహాయాన్ని నిలిపివేశారు. అయితే ఇప్పుడు వరద సహాయం మళ్ళీ తిరిగి ఇస్తుంది తెలంగాణా సర్కార్. దీనితో వరద బాధితులు భారీగా బారులు తీరారు. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ లోకేష్ కుమార్ కీలక ప్రకటన చేసారు.
వరద సాయం కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదు అన్నారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయి అన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధృవీకరించుకున్న తరువాత వారి అకౌంట్ లోకి నేరుగా వరదసాయం డబ్బు జమ అయితుంది అని చెప్పారు. అయితే మీసేవా సెంటర్ల వద్ద మాత్రం జనాలు భారీగా ఉన్నారు. ఈ నెల 7 నుండి మీ సేవ కేంద్రాల వద్ద అప్లికేషన్ చేసుకోవాలని సిఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.