వ‌ధువు కోవిడ్ పాజిటివ్‌.. పీపీఈ కిట్లు ధ‌రించి వివాహం చేసుకున్నారు..!

-

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆ వైర‌స్ నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకునే జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ ఆ జీవ‌న‌శైలికి అల‌వాటు ప‌డ్డారు. మాస్కులు ధ‌రించ‌డం, చేతులు మాటిమాటికీ శుభ్రం చేసుకోవ‌డం, సామాజిక దూరం పాటించ‌డం అనేవి మ‌న నిత్య జీవితంలో భాగం అయ్యాయి. అయితే క‌రోనా నేప‌థ్యంలో పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల‌ను జ‌నాలు ప‌రిమిత సంఖ్య‌లో అతిథుల‌తో నిర్వ‌హిస్తున్నారు. కానీ అక్క‌డ మాత్రం వ‌ధువుకు ఏకంగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయినా వారు పెళ్లి చేసుకోవ‌డం మాన‌లేదు.

bride and groom married by wearing ppe kits

రాజ‌స్థాన్‌లోని షాబాద్ అనే ప్రాంతంలో వ‌ధువుకు కోవిడ్ సోకింది. దీంతో బారిలోని కోవిడ్ సెంట‌ర్‌లో ఆమె చికిత్స పొందుతోంది. అయితే పెళ్లి ఉండ‌డంతో వారికి ఒక ద‌శ‌లో ఏం చేయాలో తెలియలేదు. కానీ చివ‌ర‌కు వారు పీపీఈ కిట్ల‌ను ధ‌రించి వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అదే ప‌ని చేశారు. పండితుడు కూడా పీపీఈ కిట్ ధ‌రించి వారి వివాహం జ‌రిపించాడు.

క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ వారు అలా వివాహ తంతు ముగించేశారు. అయితే పీపీఈ కిట్లు ధ‌రించి వారు పెళ్లి చేసుకున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్లు వారి పెళ్లి ప‌ట్ల భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. గ్రేట్ ఇండియ‌న్ పాండెమిక్ వెడ్డింగ్‌.. పిల్ల‌లు మ్యారేజ్ హాల్స్‌లో, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు ఆల‌యాల్లో, పెద్ద‌లు కోవిడ్ సెంట‌ర్ల‌లో వివాహం చేసుకుంటారు.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news