భారతీయులకు బాగా సుపరిచితులైన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటంటే… ప్రపంచంలో అనేక రకాల పూలు వివిధ ఆకారాలలో ఉంటాయి. అందులో ఆర్కిడ్ పూలు కూడా ఓ రకం. అలాంటిది ఆ పువ్వు ఓ చెట్టు పై కదలాడుతూ కనిపించింది. అయితే అది గాలి వల్ల కదలట్లేదు సుమా… ప్రాణం ఉండి కదులుతోంది. అదేంటి పూలకు ప్రాణం ఉండే చెట్లకు కాస్తాయి కానీ, కదులుతాయని అనుకుంటున్నారా…? ఆ అదేనండి విషయం..
నిజానికి ఆ పువ్వు కదలడానికి గల కారణం, అందులోకి దూరిన పురుగు. ఆ కీటకం పువ్వు లోనికి దూరి అటు ఇటు కదులుతోంది. దీంతో చూసినప్పుడు పురుగు కదిలిందని ఎవరు అనుకోరు, ఆ విషయం తెలిసిన వారు తప్ప. నిజంగా ఈ వీడియోని చూస్తే ఒక పువ్వు దానంతట అదే తిరుగుతూ కనిపిస్తుందేమో అని భ్రమిస్తాం కూడా. ఇలాంటి కీటకాలు ఎక్కువగా భారతదేశ పశ్చిమ కనుమలలో కనబడతాయి.
Walking orchids💚
These are insects known as Orchid Mantis. Seen in western ghats of India. Incredible Nature.. pic.twitter.com/CgYeGRHv97
— Susanta Nanda IFS (@susantananda3) July 13, 2020