టాలీవుడ్‌లో ఫోక్‌ సాంగ్స్‌ హంగామా

-

ఇన్నాళ్లు వెస్ట్రన్ స్టైల్, మోడ్రన్‌ మ్యూజిక్‌ అంటూ సాగిన తెలుగు సినిమా ఇప్పుడు ఫోక్‌కి ప్రియారిటీ ఇస్తోంది. చిన్న హీరోలు, పెద్ద స్టార్లు అంతా జానపదాలకి స్టెప్పులేస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఫోక్యులర్‌ సాంగ్స్‌ పెరిగిపోతున్నాయి.

తెలుగు మ్యూజిక్ వరల్డ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పాట ‘సారంగదరియా’. ‘లవ్‌స్టోరీ’ సినిమాలో సుద్దాల అశోక్‌తేజ్ రాసిన ఈ పాటకి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సాయి పల్లవి స్టెప్పులు, మంగ్లీ వాయిస్‌ కలిసి ఈ పాట ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. ఇక ఈ రెస్పాన్స్‌తో ‘లవ్‌స్టోరి’ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది.

మిక్కీ.జే.మేయర్ ఎక్కువగా మెలడీ సాంగ్స్‌ కంపోజ్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ప్రేక్షకులు పల్లెపాటలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఈ మెడ్లీ మ్యూజిక్‌ డైరెక్టర్ కూడా ‘శ్రీకారం’ కోసం ఫోక్‌ స్టైల్‌లో ‘భలేగుంది బాలా’ అనే పాట కంపోజ్‌ చేశాడు. పెంచల్‌ దాస్‌ రాసి, పాడిన ఈ పాటకి నెటిజన్స్‌ నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

డిజిటల్‌ వరల్డ్‌లో ఎక్కువగా హంగామా చేస్తోన్న పాట ‘నాదీ నక్కిలీసు గొలుసు’. ఎన్నాళ్ల నుంచో జనాల నోళ్లలో ఉన్న ఈ పాటని వెండితెరపైకి తీసుకొచ్చాడు రఘు కుంచె. ‘పలాస 1978’ సినిమాలో ఈ పాటని రీ క్రియేట్‌ చేశాడు రఘు కుంచె. టిక్‌టాక్‌తో మరింత ఫేమస్‌ అయిన ఈ పాట, టిక్‌టాక్‌ బ్యాన్‌ అయ్యాక కూడా సందడి చేస్తూనే ఉంది.

ఓల్డ్‌ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఈ జనరేషన్ ఆడియన్స్‌ ఫోక్‌ సాంగ్స్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో విజిల్స్‌ పడుతున్నాయి. పైగా జానపదాలతో సినిమాకి బజ్‌ కూడా పెరుగుతోంది. దీంతో మేకర్స్‌ కూడా ఫోక్‌ సాంగ్స్‌కి ప్రియారిటీ ఇస్తున్నారు. నాని ‘క్రిష్ణార్జున యుద్ధం’ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఈ సినిమాలోని ‘దారిచూడు దుమ్ముచూడు’ మామ పాట మాత్రం సూపర్ హిట్‌ అయ్యింది. పెంచల్‌ దాస్‌ రాసి పాడిన ఈ పాట ఇప్పటికీ మ్యూజిక్‌ లవర్స్‌తో స్టెప్పులేయిస్తూనే ఉంటుంది.

సిద్‌ శ్రీరామ్‌ అనగానే ఫీల్ గుడ్ రొమాంటిక్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. లేదంటే హార్ట్ బ్రేక్ సాంగ్స్‌తో గుండెలు బరువెక్కుతాయి. కానీ సిద్‌ జానపదం కూడా పాడాడు. ‘నల్లమల’ సినిమాలో ‘ఏమున్నావే పిల్లా’ అంటూ ఫోక్ సాంగ్ పాడాడు. అయితే ఈ సాంగ్‌లోనూ సిద్‌ ఓల్డ్‌ స్టైల్‌ కనిపిస్తుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఈ మధ్య ఫోక్‌ ట్రెండ్‌ ఎక్కువగా ఫాలో అవుతున్నాడు. ‘అరవింద సమేత’ నుంచి జానపదాలని కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో ఫైట్‌తో జానపద పటాలు కూడా పెడుతున్నాడు. ‘అరవింద సమేత’ క్లైమాక్స్‌లో రెడ్డమ్మ పాట పెట్టిన త్రివిక్రమ్‌, ‘అల వైకుంఠపురములో’ ఉత్తరాంధ్ర స్టైల్‌తో ‘సిత్తరాల సిరపడు’పాట కంపోజ్ చేయించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news