కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదింటీనీ ఫాలో అవ్వండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య లో కిడ్నీ సమస్య కూడా ఒకటి. ఎంతో మంది కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే నిజానికి కిడ్నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే కిడ్నీ ఒంట్లో ఉండే చెడు పదార్థాలను బయటికి పంపిస్తుంది.

 

kidney
kidney

కిడ్నీలో కనుక ఏమైనా సమస్యలు వచ్చాయి అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని కిడ్నీల ఆరోగ్యం పై కూడా శ్రద్ధ పెట్టడం ముఖ్యం. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి…?, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఆలస్యమెందుకు దీనికోసమే పూర్తిగా చూసేయండి.

ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం:

చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని కారణంగా హై బీపీ వస్తుంది. అది కిడ్నీ ఆరోగ్యానికి ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని సరైన ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయాలి. బాగా బరువుగా ఉన్నవాళ్లు రన్నింగ్, జాకింగ్, సైకిలింగ్, డాన్స్, స్విమ్మింగ్ లాంటివి రోజూ చేస్తూ బరువు తగ్గొచ్చు. దీంతో కిడ్నీలపై కూడా నెగెటివ్ ప్రభావం పడదు.

ఎక్కువ నీళ్ళు తీసుకోవడం:

రక్తంలో నుండి చెడు పదార్థాలను తొలగించడానికి నీళ్ళు బాగా సహాయపడుతాయి. అలానే కిడ్నీలో రాళ్ళు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకుంటుంది. అందుకనే హైడ్రేట్ గా ఉండడం, ఎక్కువ నీళ్ళు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే హైడ్రేట్ గా ఉండడం అవసరం కానీ ఓవర్ హైడ్రేషన్ వల్ల కూడా సమస్యలు వస్తాయి గమనించండి.

OTC పిల్స్ కి దూరంగా ఉండండి:

నాన్ స్టెరాయిడ్ యాంటీఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ కిడ్నీల పై నెగటివ్ ప్రభావం చూపిస్తాయి. అందుకని అటువంటి వాటిని ఉపయోగించకుండా ఉండడమే మంచిది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం:

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలా సమస్యలు మీ నుండి దూరంగా ఉంటాయి కాబట్టి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. బాగా కొవ్వు ఉండే పదార్థాలని, బయట ఆహారాన్ని తీసుకోకండి. ప్రొసెస్డ్ మీట్ వంటి వాటి వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి.

ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండండి:

ధూమపానం వల్ల మద్యపానం వల్ల కూడా హైబిపి వస్తుంది. దీనితో కిడ్నీలపై కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ దురలవాట్లు ఉన్న వాళ్ళు మానుకోవడం మంచిది. దీనితో కూడా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కనుక వీటిని అనుసరిస్తే కచ్చితంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే కిడ్నీ సమస్యలకు మీరు దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news