మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పై కేసు నమోదు చేసిన అంశంపై టిడిపి నేత నారా లోకేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గాడిదకు గంధం వాసన తెలుస్తుందా ? అంటూ సిఎం జగన్, వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు నారా లోకేష్. ధర్మాన్ని పాటించని సిఎం జగన్ కు అనువంశిక ధర్మకర్తని గౌరవించడం ఏం తెలుస్తుంది ? అని ప్రశ్నించారు.
గాడిదకు గంధం వాసన తెలియనట్టేనని.. ప్రజాధనం దోచి దాచుకునే వైసీపీ నేతలకు, నీతినిజాయితీ-దానం గుణంగల మహారాజు అశోక్ గజపతి గారి గొప్పతనం తెలియదని మండిపడ్డారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ కు తెలియకుండానే బోడికొండపై రామాలయ నిర్మాణం తలపెట్టడం, నిబంధనలు ఉల్లంఘనపై ప్రశ్నించిన రాజు గారిపైనే కేసు నమోదు చెయ్యడం హిందూ ధర్మంపై జరుగుతున్న పైశాచిక దాడికి నిదర్శనమని అగ్రహించారు. ఆలయాలకు రక్షణ కల్పించడంలో విఫలమైన మంత్రులు ఇప్పుడు ఏకంగా దేవాలయాల సంప్రదాయాలు పాటించకుండా అపచారం తలపెడుతున్నారని ఫైర్ అయ్యారు నారా లోకేష్.