చాలా మంది కంటి ఆరోగ్యం దెబ్బతింటే భవిష్యత్తులో దాన్ని కాపాడటం కష్టము అని భావిస్తారు. కానీ కంటి దృష్టిని మెరుగుపర్చడానికి మీరు కొన్ని చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజు ఆరోగ్యకరమైన అలవాట్లని తప్పకుండా అనుసరించాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎలా అయితే బాగా మంచి ఆహారం తినడం, సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం ఎంత అవసరమో కంటి ఆరోగ్యానికి కూడా ఈ అలవాట్లు అవసరమే. కాబట్టి మీకు నచ్చిన విధంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంపిక చేసుకుని కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
ఈ కాలం లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు స్క్రీన్ ముందే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. అలాంటప్పుడు మీ కంటి పై చాలా ఒత్తిడి పడి మీకు తెలియకుండానే వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కంప్యూటర్స్ మరియు మొబైల్స్ నుండి వచ్చే యు.వి కిరణాలు మీ కళ్ళకు హానికరం. దాంతో కంటికి రక్షణ ఉండదు. అంతేకాదు అధికంగా నీలికాంతి మన కంటి పై పడినా అది కంటి ఆరోగ్యానికి మంచిది కాదు.
చాలా మంది ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుందని కళ్ళ అద్దాలు ఉపయోగించే పని ఉండదు అని అపోహపడుతుంటారు. నిజానికి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం వల్ల మీ కంటి చూపు మెరుగు పడుతుంది కానీ మొత్తానికి ఈ సమస్య తొలగిపోదు. కాబట్టి భవిష్యత్తులో మీ కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ అలవాట్లను ప్రతిరోజు పాటించండి.
ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆకు కూరలు, క్యారెట్, ఫిష్ తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కొంత మందిలో వయస్సు పెరిగిన తర్వాత కంటి చూపు తగ్గిపోతుంది. అలాంటప్పుడు ముందు నుండే విటమిన్ ఏ మరియు అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. ఎక్కువగా కంటికి ఒత్తిడి పెరిగితే కళ్ళకు చాలా ఇబ్బంది అనే చెప్పాలి . కాబట్టి మీరు పని చేసేటప్పుడు అలసిపోయినట్టు అనిపిస్తే కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మరలా మీ పనిని కొనసాగించండి దాంతో కంటి పై ఒత్తిడి తగ్గుతుంది.
వీటితో పాటు సరైన నిద్ర కూడా అవసరమే. శరీరానికి ఎన్నో వ్యాయామాలు చేస్తాం కదా అదే విధంగా కంటికి సంబంధించిన వ్యాయామాలు కూడా చేయాలి. దాంతో రక్తం మరియు ఆక్సిజన్ కళ్ళలోకి సరైన విధంగా చేరుతుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు UV ప్రొటెక్షన్ ఉండేటువంటి సన్ గ్లాసెస్ ధరించండి ఇలా చేయడం వల్ల హానికరమైన కిరణాల నుండి మీరు విముక్తి పొందవచ్చు. ముందు నుండి కంటి సమస్యలతో బాధపడుతుంటే కంటి పరీక్షలు క్రమంగా చేయించుకుంటూ ఉండండి.