ప్రతిరోజు మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా సరైన నిద్రను కూడా పొందాలి. చాలా శాతం మంది కంటికి సరిపడా నిద్ర లేకపోవడం వలన ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సందర్భంలో తప్పకుండా మీ జీవన విధానంలో మార్పులను చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా ఎక్కువ అయింది దీనివలన చాలా శాతం మంది సరైన సమయానికి నిద్రపోవడం లేదు. ఈ విధంగా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కనుక శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర ఎంతో అవసరం.
మంచి నిద్రను పొందాలంటే ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవాలి. ఒకే సమయానికి ప్రతిరోజు నిద్రపోవడం వలన అలవాటుగా మారుతుంది. దీంతో సరైన సమయానికి నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కెఫైన్ ఉండేటువంటి కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండడం మేలు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో వీటిని తీసుకోవడం వలన నిద్ర పై ఎంతో ప్రభావం ఉంటుంది. కనుక సాయంత్రం 6 గంటలకు ముందు మాత్రమే కాఫీ వంటివి తీసుకోవాలి. అదేవిధంగా రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ లు, లాప్టాప్స్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మంచి నిద్రను పొందాలంటే స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ల ద్వారా వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
దీనివలన నిద్ర పై ఎంతో ప్రభావం ఉంటుంది. సరైనా నిద్ర ను పొందకపోతే సాయంత్రం సమయంలో శారీరక వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీంతో శరీరంలో అడ్రినాలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా మంచి నిద్రను పొందవచ్చు. నిద్రపోయే ముందు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుంది. కనుక తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే రాత్రి సమయంలో త్వరగా నిద్రపోతారో ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది మరియు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.