ఆగకుండా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు.. ఈ చిట్కాలను తప్పక ప్రయత్నించాల్సిందే..!

-

కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్లు ఎక్కువగా రావచ్చు. అలాంటి సమయంలో కేవలం మంచినీరు తీసుకున్నా తగ్గకపోవచ్చు. ఈ సందర్భాల్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఎక్కిళ్లను ఆపవచ్చు. ఎక్కిళ్లను కంట్రోల్ చేయాలంటే పంచదారను తినాలి. ఎప్పుడైతే ఎక్కిళ్లు వస్తాయో, కొంత పంచదారను తినడం వలన ఎక్కిళ్లను ఆపుకోవచ్చు. అంతేకాకుండా, చల్లటి నీళ్లు గబగబా తాగితే కూడా ఎక్కిళ్లను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా, ఎక్కిళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు నాలికను ముందుకు పెట్టాలి. ఇలా చేయడం వలన గొంతులో ఉండే నరాలు మరియు కండరాలకు ప్రభావం చూపుతుంది, దీనివలన ఎక్కిళ్లు తగ్గుతాయి.

కొంతమందికి ఎక్కిళ్లు వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో, పేపర్ బ్యాగ్ తీసుకుని ముఖం దగ్గర పెట్టుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన ఎక్కిళ్లు తగ్గుతాయి. అంతేకాకుండా, నిమ్మకాయను నెమ్మదిగా తినడం వలన కూడా ఎక్కిళ్లను తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్కిళ్లు ఆగకుండా వస్తాయో, ఈ చిట్కాను తప్పకుండా ప్రయత్నిస్తే దాంతో వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి. ఇదే విధంగా, చల్లటి నీళ్లను నోట్లో వేసుకుని పుక్కిలించడం వలన కూడా ఎక్కిళ్లను తగ్గించుకోవచ్చు.

అంతేకాక ఎక్కువగా ఎక్కిళ్లు వస్తున్నప్పుడు, పీనట్ బటర్‌ ను నోట్లో వేసుకుని నెమ్మదిగా తినాలి. పీనట్ బటర్ కు ఉండే టెక్స్చర్ వలన, ఎక్కిళ్లు ఆగడానికి సహాయం చేస్తుంది. సహజంగా, ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఇతరులను భయపెట్టడం లేదా సర్ప్రైజ్ చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వలన కూడా ఎక్కిళ్లు వెంటనే తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, నెమ్మదిగా ఐస్ క్యూబ్‌ను తినడం వలన, ఆ చల్లదనానికి ఎక్కిళ్లు తగ్గుతాయి. కనుక, ఇటువంటి చిన్న చిట్కాలను పాటించడం వలన ఎక్కిళ్ల ను ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news