ఎంత తిన్నా స్లిమ్​గా ఉండాలా.. ఐతే ఈ ఆహారం తినండి..!

-

చాలా మంతి యువతుల కల స్లిమ్​గా ఉండటం. ఫిట్​గా ఉండటం కంటే అమ్మాయిలు స్లిమ్​గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఏ అమ్మాయినైనా దేవుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు అని అడిగితే దాదాపు అందరూ చెప్పేది ఒకటే సమాధానం. అదే ఎంత తిన్నా లావు అవ్వకుండా ఉండాలని. చాలా మంది సన్నబడాలనే ఆశతో తిండి మానేస్తారు. దానివల్ల గ్యాస్ ఫామ్ అయి ఇంకా అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటారు. అందుకే ఎంత తిన్నా సన్నగానే ఉండాలి అంటే.. కొవ్వులు తక్కువగా ఉండే.. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాంటి ఫుడ్స్ ఏమున్నాయో తెలుసుకోండి.. ఈరోజు నుంచి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుని స్లిమ్​గా ఉండండి..

సీజనల్ పండ్లు.. ఎప్పటికైనా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. ఇంకా సీజన్​లో లభించే పండ్లు తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల బరువు పెరగరు. అవి శరీరానికి చాలా శక్తినిస్తాయి కూడా. పోషణను కూడా అందిస్తాయి. తాజా పండ్లను హోల్‌గ్రెయిన్ తృణధాన్యాలతో కలిపి తింటే చాలా రుచిగా కూడా ఉంటాయి.

నట్స్.. నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులను, ప్రొటీన్లతో నిండి ఉంటాయి. కనుక వీటిని తరచూ తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు వాల్‌నట్‌లు, బాదం పప్పులు, వేరు శెనగలు, పిస్తాలు రోజుకు రెండు పూటలా తింటే ఎంతో మంచిది.

ఓట్స్.. ఓట్స్ చాలా మందికి నచ్చని ఆహారం. కానీ ఇవి ఎంతో ఆరోగ్యకరమైవి. దీనిలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండానే పొట్ట నిండిన ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఓట్స్ లో కాస్త పాలు, పండ్లు కలిపి తింటే ఎంతో ఆరోగ్యం. ఇలా మీరు పొట్ట నిండా తిన్నా కూడా బరువు పెరగరు.

పెరుగు.. పెరుగులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వెన్న తీసిన పాలతో తయారైన పెరుగు తినడం మంచిది. అదనపు రుచి కోసం పండ్లు జతచేయచ్చు. తాజా పండ్ల ముక్కలు కూడా వేసుకోవచ్చు.

చిక్‌పీస్.. కొమ్ము శెనగల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రుచిగా కూడా ఉంటాయి. వాటిని నానబెట్టి నూనెలో వేయించి ఉప్పు, మిరియాల పొడి వేసి వండుకుని తింటే ఆ రుచే వేరు. ఆకలిగా ఉన్నప్పుడు తినడం వల్ల శక్తి కూడా అందుతుంది.

పాప్‌కార్న్.. చాలా మంది పాప్​కార్న్ జంక్ ఫుడ్ అనుకుంటారు. కానీ ఇది ఫైబర్ ఫుడ్. కాబట్టి పిల్లలతో పాటూ పెద్దలు కూడా లాగించవచ్చు. ఇది బరువు పెంచదు కూడా, ఎందుకంటే దీని ద్వారా అంతే కేలరీలు చాలా తక్కువ. ఇది గ్లూటెన్ రహిత చిరుతిండి. ఇంట్లో తయారుచేసుకుని పాప్ కార్న్ తింటే మరీ రుచిగా ఉంటుంది.

అవకాడోలు.. అవకాడో పండ్లు మనకు పండవు కానీ బాగానే దిగుమతి అవుతాయి. ప్రతి సూపర్ మార్కెట్లోనూ అవి అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండవు కానీ చాలా ఆరోగ్యం. అవకాడో ముక్కలు, ఉల్లిపాయలు, టొమాటోలు నిమ్మరసం కలిపి తింటే బాగుంటుంది.

పీనట్ బటర్.. పీనట్ బటర్ ప్రొటీన్లతో నిండి ఉంటుంది. ఇది చాలా శక్తిని అందిస్తుంది. అందుకే పిల్లల కోసమే ఆ ఆహారం అనుకోకుండా పెద్దవాళ్లు కూడా తినాలి. దీన్ని తినడం వల్ల కూడా బరువు పెరగరు.

Read more RELATED
Recommended to you

Latest news