యాదాద్రిలో 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు

-

కృష్ణాష్టమి వేడుకలు ఈ నెల 20 నుంచి యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో నిర్వహించనున్నారు అధికారులు. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు శ్రీ కృష్ణాష్టమి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని వెల్లడించారు అధికారులు. ఈనెల 22న (సోమవారం) శ్రీకృష్ణ జయంతి సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 4.30 గంటలకు ఉట్లు కోట్టే కార్యక్రమం (శిఖ్యోత్సవము) నిర్వహిస్తామన్నారు అధికారులు.

Yadadri and the Temple of Boom- The New Indian Express

అదేరోజు రాత్రి 7.45 గంటలకు రుక్మిణి కల్యాణోత్సవం నిర్వహిస్తాని తెలిపారు అధికారులు. కణ్ణన్ తిరునక్షత్రం సందర్భంగా శనివారం నాటి నిత్య కల్యాణం, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, భోగములు రద్దు చేస్తున్నామని వెల్లడించారు అధికారులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news