శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రం రూపంలో మూత్రపిండాలు బయటకు పంపించివేస్తాయి. మూత్రపిండాల్లో ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళక ఇబ్బంది అవుతుంది. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
కిడ్నీల పనితీరును ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
చేపలు (సాల్మన్, టూనా)
ఈ చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమాలు ఉంటాయి. వీటివల్ల రక్తంలోని చెడుకొవ్వు కరిగిపోయి రక్తప్రసరణలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కావున హైబీపీ సంబంధ సమస్యలు రాకుండా ఉంటుంది. అంతేగాకుండా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆపిల్:
రోజుకొక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెబుతారు. వంద గ్రాముల ఆపిల్ లో 2.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇంకా విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చక్కెర స్థాయిలను తగ్గించి మూత్రపిండాలు సరిగా పనిచేయడంలో సాయపడతాయి.
క్యాబేజి:
ఇందులో సోడియం, పొటాషియం తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె ఎక్కువ స్థాయిల్లో ఉంటాయి. క్యాబేజీని సలాడ్ల రూపంలో తినవచ్చు, శాండ్విచ్ తో కలుపుకోవచ్చు. కూర వండుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్:
యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా గల ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల గుండె సంబంధ సమస్యలు దూరమయ్యే అవకాశం ఎక్కువ. ఇంకా మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది.
వెల్లుల్లి:
ఇందులోని అల్లిసిన్ అనే పదార్థం శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. కిడ్నీలకు ఆరోగ్యాన్ని అందించడంలో వెల్లుల్లిది ప్రముఖ పాత్ర. కాబట్టి వెల్లుల్లిని మీ డైట్ లో చేర్చుకోవడం మర్చిపోవద్దు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.