కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

-

ఫార్ములా – ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. నేటితో కేటీఆర్ ను అరెస్టు చేయకూడదన్న గడువు ముగిసింది. హైకోర్టు గడువు ముగియడంతో పాటు కేటీఆర్ ముందస్తు బెయిల్ విషయంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేయాలని ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు.

Formula E Car Race ED wrote to Telangana ACB on this case

ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్ వాదనలు వినిపించారు. ఫార్ములా – ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ పై ఏ 1 నిందితుడిగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని ప్రశ్నించింది హైకోర్టు.

కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని.. గవర్నర్ అనుమతి తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏజీ తెలిపారు. ఈ కేసు పై మంగళవారం హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. వాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేంతవరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Latest news