అంతా వాళ్లే చేశారు….తేలని ఎన్ ఆర్ ఐ ల లెక్క

-

ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారికి అగ్రరాజ్యం సైతం కుదేలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఈ భయంకరమైన మహమ్మారి భారత్ లో కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం తో లాక్ డౌన్ ను కూడా ప్రకటించారు. అయితే ఈ కరోనా కేసులు అన్ని కూడా నమోదు అవ్వడానికి ప్రధాన కారణం ఎన్ ఆర్ ఐ లే అని తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా ఉన్నట్లు అయితే ఇంత తీవ్ర స్థాయిలో కరోనా వ్యాపించి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చడం తో భారత్ కూడా లాక్ డౌన్ కు పిలుపునివ్వడం తో ప్రజలు సైతం ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ భారత్ లో ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే విదేశాల నుంచి వచ్చిన వారి నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అని అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారే.వివిధ దేశాల నుంచి మనదేశానికి వచ్చినవారు తమంత తాముగా ప్రభుత్వానికి సరెండర్ కావాలని, పరీక్షలు చేయించుకుని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. చైనా నేర్చుకున్న అనుభవాన్ని ప్రపంచానికి తెలపడం తో భారత్ కూడా అదే పద్దతిని పాటించాలని చూస్తున్నప్పటికీ కొంతమంది భాద్యత లేని వారి కారణంగా మొత్తం సమాజమే ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన కరోనా కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారే. అయితే గత రెండు నెలల్లో విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకు, కోవిడ్ 19 కోసం పర్యవేక్షణలో తేలిన లెక్కకు పొంతన కుదరకపోవడంతో భారత ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఇక ఫైన్ స్టేజ్ కూడాగత రెండు నెలల కాలంలో మొత్తం 15 లక్షల మంది విదేశాల నుంచి భారత్‌లోకి వచ్చినట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు.అయితే ఇండియా లాక్‌డౌన్ ప్రకటించడాని కంటే ముందే వచ్చిన వారితోనూ ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది.

కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు బయటపడటానికి 14 నుంచి 21 రోజుల సమయం పడుతుండటంతో ఈ లోగా వారు ఎంతమందికి అంటించారోనని అటు కేంద్రం తో రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా తీవ్ర కలకలం రేగుతుంది. అసలు మందే లేని ఈ వైరస్ కు సోషల్ డిస్టెన్సింగే పెద్ద మందు అని చైనా తెలపడం తో భారత్ కూడా దానినే పాటించాలని చూస్తున్నప్పటికీ దేశంలో గత వారం రోజుల నుంచి కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే అలా నమోదవుతున్న కేసులు ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య తిరగడం వల్ల సంభవించినవేనని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 31 వేల మంది మృతి చెందగా, 7 లక్షల వరకు ప్రజలు ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news