మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ… నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తాం. తుని నుంచి విశాఖకు లోకల్ రైలు సదుపాయం కల్పిస్తాం. కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపిస్తాం అని తెలిపారు.
తునిలోని వంద చెరువుల్లో వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మట్టి తవ్వేశారు అని మండిపడ్డారు. జర్నలిస్టులుపైనా దాడులు చేశారు. ఓ విలేకరిని చంపేశారు. అన్యాయానికి పాల్పడితే సహించేది లేదు అని హెచ్చరించారు. జర్నలిస్టులకు అండగా ఉంటాం. తుని మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖాయమైందని, మెజార్టీ కోసమే మనమంతా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.తునిలో హేచరీస్ పెట్టాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రూపాయి ఖర్చుకాకుండా హేచరీస్‌కు అనుమతిస్తాం” అని తెలిపారు.